BIKKI NEWS (JUNE 06) : BIMSTEC DAY JUNE 6th. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోపరేషన్ ఏర్పాటుకు గుర్తుగా ప్రతి సంవత్సరం జూన్ 6న బిమ్ స్టెక్ డే గా నిర్వహిస్తారు.
BIMSTEC DAY JUNE 6th.
బంగాళాఖాతం ఒడ్డున లేదా ఆనుకుని ఉన్న దేశాలన్నీ ఈ సంస్థలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇందులో మొత్తం ఏడు సభ్య దేశాలు ఉన్నాయి.
వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, పర్యాటకం, మత్స్య సంపద, రవాణా లాంటి రంగాల్లో వాటి మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం.
బంగాళాఖాతం వెంట భారత్ కు 6500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 33% దీని మీదుగానే జరుగుతుంది.
ఈ సదస్సు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ సదస్సులో సభ్య దేశాలు అనుసరించాల్సిన సహకార విధానాలను రూపొందించి కార్యాచరణ పై దృష్టి పెడతారు. తాజాగా శిఖరాగ్ర సదస్సు 2025 ఏప్రిల్ 6న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో నిర్వహించారు.
బిమ్‌స్టెక్ 1997 జూన్ 6న భారత్,బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలతో ఏర్పాటు చేశారు. తర్వాత నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్