BIKKI NEWS (JUNE 16) : Big update on double bed room houses. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా వెసులుబాటు కల్పించాలని ఇందుకు. ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Big update on double bed room houses.
ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, మౌళిక వసతులపై సచివాలయంలో అధికారులతో సమీక్షించడం జరిగింది.
మొండి గోడలతో అసంపూర్తిగా ఉన్న లక్షా 61 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గుర్తించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు.
రూ.640 కోట్లతో పూర్తిచేసి 98,000 మంది లబ్దిదారులకు ఇప్పటికే కేటాయించడం జరిగిందని గుర్త చేశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాని పక్షంలో..లబ్ధిదారులే ఇండ్లను నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని తెలిపారు.
ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందించాలని నిర్ణయం.
ఇండ్ల స్థలాలు లేని, అర్హత కలిగిన లబ్ధిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయించాలని నిర్ణయం.
తక్షణమే అర్హులను గుర్తించి ఇండ్లను కేటాయించాలని అధికారులకు ఆదేశం.
నిరుపేదలకు నీడను కల్పించడమే ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని ఈ సందర్భంగా ప్రకటించారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్