Home > NATIONAL > BHARAT BRAND RICE – మార్కెట్‌లోకి ‘భారత్‌’ బియ్యం

BHARAT BRAND RICE – మార్కెట్‌లోకి ‘భారత్‌’ బియ్యం

BIKKI NEWS (FEB. 07) : కేంద్ర ప్రభుత్వం మంగళవారం ‘భారత్‌ రైస్‌’ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. కేజీ 29/- రూపాయలకు భారత్‌ బ్రాండ్‌ బియ్యాన్ని (BHARAT BRAND RICE AT 29 RUPEES) అందుబాటులోకి తెస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే

ఈ నేపథ్యంలో ఈ బియ్యం 5 కిలోలు, 10 కిలోల ప్యాకెట్లలో కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ‘భారత్‌ రైస్‌’ను ప్రారంభించారు.

నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా ప్రారంభించిన కిలో రూ.29కే భారత్‌ రైస్‌తో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం లభిస్తుందన్నారు. ఈ బియ్యం విక్రయించే 100 మొబైల్‌ వ్యాన్లను కూడా మంత్రి ప్రారంభించారు. త్వరలో ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలలో కూడా లభ్యమవుతాయి.