BIKKI NEWS (SEP. 10) : BEST COUNTRIES LIST 2024 REPORT. యూఎస్ న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ వెలువరించిన ‘ఉత్తమ దేశాల ర్యాంకింగ్స్ 2024’ లో స్విట్జర్లాండ్ వరుసగా మూడో ఏడాది అత్యుత్తమ దేశంగా నిలిచింది.
BEST COUNTRIES LIST 2024 REPORT
ఈ జాబితాలో భారత్ మాత్రం 3 స్థానాలు దిగజారి 33వ స్థానంలో నిలిచింది. India 33rd rank in best countries list 2024.
ప్రపంచ వ్యాప్తంగా 89 దేశాల్లో నిర్వహించిన సర్వేలో సాహసం, క్రియాశీలత, వారసత్వం, వ్యాపార నిర్వహణ & అభివృద్ధి సామర్థ్యం, జీవన నాణ్యత, సంస్కృతి, సంప్రదాయాలు తదితర 10 అంశాల్లో ఉప ర్యాంకింగ్స్ తీసుకున్నారు. ఈ 10 అంశాల పరిశీలనకు 73 గుణాలను పరిగణనలోనికి తీసుకున్నారు. జీవన నాణ్యత, విస్తృత వాణిజ్య అవకాశాల్లో చక్కని పనితీరుతో స్విట్జర్లాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది.
రెండో స్థానంలో జపాన్, మూడో స్థానంలో అమెరికా, నాలుగో స్థానంలో కెనడా, ఐదో స్థానంలో ఆస్ట్రేలియా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.
చైనా 16,రష్యా 36, శ్రీలంక 55, బంగ్లాదేశ్ 71, మయన్మార్ 73, ఉక్రెయిన్ 80 వ స్థానాలలో నిలిచాయి.
TOP 10 BEST CONUTRIES LIST 2024
- స్విట్జర్లాండ్
- జపాన్
- యునైటెడ్ స్టేట్స్
- కెనడా
- ఆస్ట్రేలియా
- స్వీడన్
- జర్మనీ
- యునైటెడ్ కింగ్‌డమ్
- న్యూజిలాండ్
- డెన్మార్క్
చివరి 5 దేశాలు
- కామెరూన్
- అల్జీరియా
- లెబనాన్
- సెర్బియా
- బెలారస్
FOLLOW US @TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు
వెబ్సైట్ : https://www.usnews.com/news/best-countries/rankings