BEST AIRPORTS INDEX 2024

BIKKI NEWS (APRIL 20) : BEST AIRPORTS 2024 INDEX BY SKY TRACK REPORT – ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను స్కై ట్రాక్ సంస్థ 2024 గాను విడుదల చేసింది. ఈ నివేదికలో డిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 36వ స్థానంలో నిలచి‌ భారత్ నుంచి అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది.

ఈ నివేదికలో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఖతార్ లోని దోహ నగరంలో ఉన్న హమాద్ విమానాశ్రయం నిలిచింది. రెండో స్థానంలో సింగపూర్ కు చెందిన చాంగీ విమానాశ్రయం, మూడో స్థానంలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని ఇన్చేయాన్ విమానాశ్రయం నిలిచింది.

ఇన్చేయాన్ విమానాశ్రయానికి బెస్ట్ ప్యామిలీ ప్రెండ్లీ విమానాశ్రయంగా కూడా నిలిచింది.

దక్షిణాసియాలో ఉత్తమ విమానాశ్రయంగా ఇందిరాగాంధీ విమానాశ్రయం – డిల్లీ నిలిచింది.

Top 5 best airports

1) హమాద్ విమానాశ్రయం – దోహ
2) చాంగీ విమానాశ్రయం – సింగపూర్
3) ఇన్చేయాన్ విమానాశ్రయం – సియోల్
4) హనీదా విమానాశ్రయం – టోక్యో
5) నరీతా విమానాశ్రయం – టోక్యో

INDIA’S BEST AIRPORTS 2024

36) ఇందిరాగాంధీ విమానాశ్రయం – డిల్లీ
59) బెంగళూరు విమానాశ్రయం
61) హైదరాబాద్ విమానాశ్రయం
95) ఛత్రపతి శివాజీ విమానాశ్రయం – ముంబై