BIKKI NEWS (OCT. 07) : B Pharmacy counseling schedule 2024 in telangana. తెలంగాణ ఎప్‌సెట్ 2024 బైపీసీ స్ట్రీమ్ లో బి ఫార్మాసి, ఫార్మా డీ, బయో టెక్నాలజీ, బయో మెడికల్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ సైన్స్ కోర్సుల్లో 2024 -25 విద్యా సంవత్సరం సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు.
B Pharmacy counseling schedule 2024 in telangana.
రెండు దశలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొదటి దశ అక్టోబర్ 19 నుంచి, చివరి దశ నవంబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 12 నుంచి స్పాట్ అడ్మిషన్స్ కల్పించనున్నారు.
మొదటి దశ కౌన్సెలింగ్ :
అక్టోబర్ 19 నుంచి 22వరకు : ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
అక్టోబర్ 21 నుంచి 23వ వరకు : సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి కానుంది.
అక్టోబర్ 21 నుంచి 25 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
అక్టోబర్ 28వ తేదీన సీట్ల కేటాయింపు జరగనుంది.
సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని, ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
తుది దశ కౌన్సెలింగ్ షెడ్యూల్
నవంబర్ 4వ తేదీన ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
నవంబర్ 5వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి.
నవంబర్ 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
నవంబర్ 9న సీట్ల కేటాయింపు జరగనుంది.
సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ 9 నుంచి 11వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని, ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
నవంబర్ 11, 12 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
నవంబర్ 12వ తేదీన స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి నిబంధనలు విడుదల కానున్నాయి.