BIKKI NEWS (MAY 20) : AZIM PREMJI SCHOLARSHIP 2025. అజీమ్ ప్రేమ్ జీ స్కాలర్షిప్ నోటిఫికేషన్ వెలువడింది విప్రో సంస్థ సామాజిక బాధ్యత కింద భారీ ఎత్తున స్కాలర్షిప్ పథకంకు నిధులను కేటాయించింది.
AZIM PREMJI SCHOLARSHIP 2025
ఈ సంవత్సరం 750 కోట్ల రూపాయల స్కాలర్షిప్లను 2.5 లక్షల మందికి ప్రయోజనం కలిగించేలా నిధులను మంజూరు చేసింది.
పదో తరగతి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న అమ్మాయిలు అజీమ్ ప్రేమ్ జీ స్కాలర్షిప్ దరఖాస్తుకు అర్హులు.
గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీ లలో రెగ్యులర్ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సుల్లో చేరిన అమ్మాయిలు కూడా దరఖాస్తుకు అర్హులే.
స్కాలర్షిప్ కు ఎంపికైన అమ్మాయిలకు కోర్సు పూర్తయ్యే వరకు ఏటా 30 వేల రూపాయల ఉపకార వేతనాన్ని అందజేస్తారు.
సెప్టెంబర్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం పదో తరగతి , 12వ తరగతి మార్కుల మెమోలు, డిగ్రీ లేదా డిప్లొమా కాలేజీలో అడ్మిషన్ పొందినట్లు సర్టిఫికెట్, ఫీజు రిసిప్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరమవుతాయి
వెబ్సైట్ : https://azimpremjifoundation.org
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్