BIKKI NEWS (AUG. 09) : Awareness programme on Drugs and Cyber Crime In GJC Sangem. ప్రభుత్వ జూనియర్ కళాశాల సంగెం లో డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్ వంటి విషయాల పట్ల సంగెం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్ నరేష్ గారు విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై గారు మాట్లాడుతూ… విద్యార్థినీ విద్యార్థులు డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అలాగే సైబర్ క్రైమ్ వంటి విషయాల పట్ల అవగాహన కలిగి ఉండి తమ ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడి చదవాలన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.