TSPSC : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఆగస్టు – 15) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూలై 13 & 14వ తేదీలలో నిర్వహించిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్. – A & B పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్స్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ (assistant veterinary surgeon exam preliminary key)లను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రాథమిక కీ & రెస్పాన్స్ షీట్స్ ని ఆగస్టు 14 నుండి సెప్టెంబర్ 13వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నారు.

ప్రాథమిక కీలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఆగస్టు 17 నుండి 19వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు వెబ్సైట్ లో ఇవ్వబడిన లింకు ద్వారా మాత్రమే అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం లో తెలియజేయాలని టిఎస్పిఎస్సి ప్రకటనలో తెలిపింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 185 అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ క్లాస్ ఏ అండ్ బి పోస్టులను భర్తీ చేయనున్నారు. జూలై 13, 14 వ తేదీలలో ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ASSISTANT VETERINARY SURGEON PRELIMINARY KEY