GALLANTRY AWARDS 2023 : కీర్తిచక్ర, శౌర్య చక్ర అవార్డులు

న్యూడిల్లీ (ఆగస్టు – 15) : 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలలో పనిచేస్తున్న సైనికుల సేవలకు గుర్తింపుగా గ్యాలంట్రీ అవార్డ్స్ 2023 ప్రకటించింది. మొత్తం 76 మందికి ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేయనున్నారు.

దేశ అత్యున్నత సైనిక అవార్డులలో అశోక చక్ర మొదటి స్థానంలో, కీర్తి చక్ర రెండవ స్థానంలో, శౌర్య చక్ర మూడో స్థానంలో ఉంటాయి.

◆ కీర్తిచక్ర గ్రహీతలు (4) :

కీర్తి చక్ర అవార్డు 2023 ఎంపికైన నలుగురు 2021 చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో నక్సలైట్లను ఎదిరించి ప్రాణాలు కోల్పోయారు.

దిలీప్ కుమార్ దాస్,
రాజకుమార్ యాదవ్,
బబ్లూ రభ,
శంభు రాయ్

◆ శౌర్యచక్ర గ్రహీతలు (11)

మేజర్ విజయ్ వర్మ,
మేజర్ వికాస బంభు (మరణానంతరం),
మేజర్ ముస్తఫా బొహరా (మరణానంతరం),
మేజర్ సచిన నేగి,
మేజర్ రాజేంద్ర ప్రసాద్ జట్,
మేజర్ రవీందర్ సింగ్ రావత్,
హవ్ వివేక్ సింగ్ తోమర్ (మరణానంతరం),
నాయక్ బీమ్ సింగ్,
రైఫిల్ మ్యాన్ కులభూషణ్ మంత
(మరణానంతరం),
సైఫుల్లా ఖాద్రి (మరణానంతరం), గమిత్ ముకేష్ కుమార్