Home > JOBS > Assistant professor jobs – అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఒకటే దరఖాస్తు

Assistant professor jobs – అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఒకటే దరఖాస్తు

BIKKI NEWS (APR. 08) : assistant professor jobs in telangana universities. తెలంగాణ రాష్ట్రం లోని అన్ని యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కొరకు ఒకటే ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.

assistant professor jobs in telangana universities

తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అవసరమైన చర్యలపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి, కళాశాల/సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన చర్చించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి, కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేశ్, ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మంగళవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమై చర్చించారు. ఒక్కో అభ్యర్థి పలు వర్సిటీలకు దరఖాస్తు చేసుకోకుండా.. ఒకటే దరఖాస్తు చేసుకునేలా ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న యూనివర్సిటీలను ఎంచుకోవచ్చు. ఈ పోర్టల్‌ నిర్వహణ బాధ్యతను ఏదైనా సాఫ్ట్‌వేర్‌ సంస్థకు అప్పగించాలని భావిస్తున్నారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు