ASIA BADMINTON : బంగారు జోడి సాత్విక్ – చిరాగ్

దుబాయ్ (మే – 01): ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ 2023 లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి ఈ మెగాటోర్నీలో స్వర్ణం సాధించిన తొలి భారత షట్లర్లుగా చరిత్రకెక్కారు.

పురుషుల డబుల్స్ భారత్ కు ఇదే తొలి స్వర్ణం కాగా.. గతంలో దినేశ్ ఖన్నా 1965లోపురుషుల సింగిల్స్ చాంపియన్ గా నిలిచాడు.

ఆదివారం జరిగిన పురుషులు డబుల్స్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 16-21, 21-17, 21-19తో ఆంగ్ యే సిన్-టోయ్ యీ (మలేషియా) జంటపై గెలుపొందింది. తొలి గేమ్ కోల్పోయిన భారత షట్లర్లు ఆ తర్వాత విజృంభించి వరుస గేమ్ ప్రత్యర్థిని చిత్తు చేశారు.

ఆసియా చాంపియన్షిప్ డబుల్స్ లో భారత్ నుంచి చివరిసారిగా దీపుఘోష్-రమన్ ఘోష్ జంట 1971లో కాంస్యం నెగ్గింది. మళ్లీ ఇన్నేండ్ల తర్వాత భారత జోడీ డబుల్స్ లో పతకం పట్టింది.