హైదరాబాద్ (ఏప్రిల్ 28) : విద్యుత్తు సంస్థల్లోని ఆర్టిజన్లకు పీఆర్సీ ప్రకారం జీతభత్యాల పెరుగుదల, వాటిని ఎలా లెక్కించాలనే దానిపై స్పష్టతనిస్తూ ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
ఆర్టిజన్లలోని గ్రేడ్-1, 2, 3, 4 కార్మి కులకు ఏ స్థాయిలో వేతనాలు పెరుగుతాయో స్పష్టంగా పేర్కొన్నారు. 2018లో సవరించిన వేతనం, ఆపై తాజాగా 2022 ఏప్రిల్ నుంచి అందించాల్సిన ఫిట్మెంట్ (7 శాతం), రెండు ఇంక్రిమెంట్లు, పే ఫిక్సేషన్, డీఏ, 1.4.2022 నాటికి అత్యధిక పర్సనల్ పే తదితర అంశాలపై ఆ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. తాజా ఫిట్మెంట్ ని 2022 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చెల్లించనున్నారు.
అలాగే పెన్షనర్లకు సంబంధించి కూడా రివైజ్డ్ పెన్షన్, డీఆర్, ఇతర వాటిపై ట్రాన్స్ కో ఉత్తర్వులు జారీచేసింది.