BIKKI NEWS (JULY 27) : డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (APPSC RIMC DEHRADUNE ADMISSIONS 2025 JUNE SESSION) జున్ – 2025 సెషన్ కు సంబంధించి ఎనిమిదో తరగతిలో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏపీకి చెందిన బాలురు, బాలికల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది.
అర్హతలు : గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 01.01. 2025 తేదీ నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
వయోపరిమితి : 01.07.2025 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి.
పరీక్ష విధానం : రాతపరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి.. మ్యాథమేటిక్స్ (200 మార్కులు), జనరల్ నాలెడ్జ్(75 మార్కులు), ఇంగ్లిష్(125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి.
రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవా(50 మార్కులు) నిర్వహిస్తారు. రాతపరీక్ష, వైవా వాయిస్ కలిపి మొత్తం 450 మార్కులకు కేటాయించారు. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
దరఖాస్తు గడువు : అక్టోబర్ – 10 – 2024.
పరీక్ష తేది: 01.12.2024.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా ఆర్ఎఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువ పత్రాలు జత చేసి అసిస్టెంట్ సెక్రటరీ (ఎగ్జామ్స్), ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, న్యూ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్స్ బిల్డింగ్, రెండో అంతస్తు, ఆర్టీఏ కార్యాలయం దగ్గర, ఎంజీ రోడ్డు, విజయవాడ చిరునామాకు పంపించాలి.
వెబ్సైట్: http://www.rimc.gov.in.
APPSC వెబ్సైట్ : https://portal-psc.ap.gov.in/Default.aspx