BIKKI NEWS (NOV. 07) : Apprenticeship Mela in Karimnagar on November 11th. కరీంనగర్ ఐటీఐ ప్రభుత్వ కళాశాలలో నవంబర్ 11న జాతీయ అప్రెంటీస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ ఐటీఐ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Apprenticeship Mela in Karimnagar on November 11th
ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులకు ఈ నెల 11న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హజరు కావచ్చు.
ఖాళీల వివరాలు :
హైదరాబాద్ కు చెందిన జాతీయ స్థాయి కంపెనీ అయిన మేధా సర్వో డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఎలక్ట్రిషియన్ 100, ఫిట్టర్ 100, ఎలక్ట్రానిక్ మెకానిక్ 60 ఖాళీలు.
స్నైదర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఎలక్ట్రిషియన్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లో 200 ఖాళీలు.
ఎంఈటీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో ఫిట్టర్ టర్నర్ మిషనిస్టు మొత్తం కలిపి 50 ఖాళీలు.
కరీంనగర్ కు చెందిన ఆదర్శ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో డీజిల్ మెకానిక్ 10, మెకానిక్ మోటార్ వెహికల్ 10, వెల్డర్ 40, ఫిట్టర్ 40, కోపా ఫిమేల్ 10 ఖాళీలు కలవు.
ఎంపికైన వారికి రూ.12 వేల చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు కింద ఇవ్వబడిన వైబ్సైట్ లో పేర్లు నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ కాఫీ, రెజ్యూమ్, ఎస్ఎస్సీ మెమో, ఐటీఐ మెమో, రెండు ఫొటోలతో మేళాకు హాజరుకావాలని సూచించారు.