Home > CURRENT AFFAIRS > APPOINTMENTS > APPOINTMENTS – NOVEMBER 2023

APPOINTMENTS – NOVEMBER 2023

BIKKI NEWS (DEC – 06) : APPOINTMENTS – NOVEMBER 2023 – CURRENT AFFAIRS – రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు నవంబర్ – 2023 లో జరిపిన నియామకాల జాబితా మీ కోసం…

1) ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రాంత తదుపరి డైరెక్టర్ గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : షమా వాజేద్ (బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా కూతురు)

2) 118 సంవత్సరాల చరిత్ర కలిగిన కజిరంగా నేషనల్ పార్క్ కు తొలి మహిళ డైరెక్టర్ గా ఎవరు ఇటీవల నియమితులై రికార్డు సృష్టించారు.?
జ : సోనాలి ఘోష్

3) CBI నూతన జాయింట్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ప్రవీణ్ మధుకర్ పవార్

4) సోమనాథ్ ఆలయం యొక్క ‘శ్రీ సోమనాథ్ ట్రస్ట్’ చైర్మన్ గా ఎవరి పదవి కాలం పొడిగించారు.?
జ : నరేంద్ర మోదీ

5) కలకత్తా హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా ఎవరిని సుప్రీంకోర్టు నియమించింది.?
జ : సిద్ధార్థ రాయ్ చౌదరి

6) మలేషియా దేశపు 17వ రాజుగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్

7) కేంద్ర ప్రధాన సమాచారం కమిషనర్ గా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు.?
జ : హీరాలాల్ సమారియ

8) కేంద్ర సమాచార కమిషనర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు.?
జ : ఆనంది రామలింగం & వినోద్ కుమార్ తివారి

9) జాతీయ కాఫీ బోర్డ్ చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది.?
జ : ఎం.జె దినేష్

10) అసియేషన్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా యొక్క సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : చలసాని వెంకట నాగేశ్వర్

11) ఆర్మడ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ (AFT) చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టీస్ రాజేంద్రమీనన్

12) టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎండీ & సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : దీపేశ్ నందా

13) RBI డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మనోరంజన్ మిశ్రా

14) వర్జీనియా స్టేట్ సెనెట్ కు వరుసగా మూడోసారి ఎన్నికైన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : ఘజలా హష్మీ

15) కొలంబియాలో డిక్టాడార్ అనే కంపెనీ తన కంపెనీకి సీఈఓ గా మొట్టమొదటిసారిగా ఒక రోబోను నియమించుకుంది ఆ రోబో పేరు ఏమిటి.?
జ : మైకా

16) సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా గా ఎవరు నియమితులయ్యారు.?
జ : హితేష్ కుమార్ మక్వానా

17) కాళ్లు, చేతులు లేని ఏ మహిళను ఎన్నికల సంఘం తన బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది.?
జ : నర్మదియా – మధ్యప్రదేశ్

18) యూపీఐ పేమెంట్ సేఫ్టీ అథారిటీ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : పంకజ్ త్రిపాఠి

19) బ్రిటన్ నూతన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : డేవిడ్ కామేరూన్

20) బ్రిటన్ నూతన హోమ్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జేమ్స్ క్లెవెర్లీ

21) భారత ఎన్నికల సంఘం ఎవరిని నేషనల్ ఐకాన్ గా నియమించుకుంది.?
జ : రాజ్ కుమార్ రావు

22) బ్రిటన్ దేశపు నూతన విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : డేవిడ్ కామేరూన్

23) బ్రిటన్ దేశపు నూతన ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : విక్టోరియా అట్కిన్స్

24) బ్రిటన్ దేశపు నూతన పర్యావరణ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : స్టీవ్ బార్డే

25) స్పెయిన్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : పెడ్రో సాంఛెజ్

26) స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) దళానికి డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అలోక్ శర్మ

27) పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : వహబ్ రియాజ్

28) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అడిషనల్ సోలిసిటర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నరసింహా శర్మ

29) మాల్దీవుల దేశపు నూతన అధ్యక్షుడు, ఉపాధ్యాక్షులుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : మహ్మద్ మయిజ్జు, హెచ్ఈ హుస్సేన్ మహ్మద్ లతీఫ్

30) భారత పొగాకు బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సీహెచ్ యశ్వంత్ కుమార్

31) IFFI 2023 జ్యూరీ చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : రాజ్‌కుమార్ హీరాని

32) అర్జెంటినా తదుపరి అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు.?
జ : జేవియర్ మేలి

33) ICC వరల్డ్ కప్ టీమ్ ఆప్ ద టోర్నమెంట్ కు కెప్టెన్ గా ఎవరిని ప్రకటించింది.?
జ : రోహిత్ శర్మ

34) లైబీరియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : జోషెఫ్ బోయకై

35) కొటక్ బ్యాంక్ నూతన ఎండి మరియు సీఈవోగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆశోక్ వాస్వాని

36) మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ సీఈవోగా ఎవరిని నియమించింది.?
జ : అపర్ణా గుప్తా

37) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారు.?
జ : వినయ్ టోన్సే

38) ఓపెన్ ఏఐ సంస్థకు తిరిగి సీఈఓ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : ఆల్ట్‌మన్

39) ఓపెన్ ఏఐ సంస్థ తాత్కాలిక సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మీరా మురాటి

40) లగ్జెంబర్గ్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : లూక్ ప్రైడేన్

41) ఈశాన్య భారతంలో పరుగు విలువను తెలపడానికి ప్రారంభించిన టాటా స్టీల్ కోల్‌కతా 25 కే (TSK 25K) మారథాన్ కు ఇంటర్నేషనల్ అంబాసిడర్ గా ఎవరిని నియమించారు.?
జ : కొలిన్ జాక్సన్

42) ఆసియన్ కూటమికి భారత రాయబారి ఎవరు.?
జ : జయంత్ ఖోబ్రాగాడే

43) ఐక్యరాజ్య సమితి ఆడిటర్ పానెల్ కు వైస్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : గిరీష్ చంద్ర ముర్ము

44) FICCI నూతన అధ్యక్షుడిగా డిసెంబర్ నెలలో ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు.?
జ : అనీష్ షొ

45) రిపబ్లిక్ ఆఫ్ మోజాంబిక్ దేశానికి భారత హై కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాబర్ట్ షెట్కిన్‌టాంగ్

46) కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీంకు ఎవరు మెంటారుగా నియమితులయ్యారు.?
జ : గౌతమ్ గంభీర్

47) బంధన్ బ్యాంక్ నూతన ఎండి మరియు సీఈఓ గా ఎవరు పునర్ నియామకం అయ్యారు.?
జ : చంద్రశేఖర్ ఘోష్

48) న్యూజిలాండ్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు.?
జ : క్రిస్టఫర్ లక్సన్

49) దేశంలో తొలిసారిగా ఒక గవర్నర్ కు ఏడీసీ “ఎయిడ్ ది క్యాంపు” గా ఒక మహిళ ఉద్యోగిని మిజోరం గవర్నర్ నియమించారు. ఆమె పేరు ఏమిటి.?
జ : మనీషా ఫాడి