BIKKI NEWS (OCT. 06) : appointment orders for AEEs librarians and AOs. హైదరాబాద్ శిల్పకళా వేదికలో వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
appointment orders for AEEs librarians and AOs.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, లైబ్రేరియన్స్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ లకు సంబంధించి ఎంపికైన 1635 మందికి నియామక పత్రాలను ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు.
పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ది మహిళా శిశు సంక్షేమల శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధ్యక్షతన నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం. హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె.కేశవరావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు.