BIKKI NEWS (JUNE 16) : AP OPEN SCHOOL ADMISSIONS 2025. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ స్కూల్ విధానం ద్వారా పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తుల కోరుతూ ప్రకటన విడుదల చేసింది.
AP OPEN SCHOOL ADMISSIONS 2025.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 30వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 200 రూపాయల ఆలస్య రుసుముతో ఆగస్టు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2025 ఆగస్టు 31 నాటికి 14 సంవత్సరాల వయసు నిండిన అభ్యర్థులు 10వ తరగతి ప్రవేశానికి అర్హులు.
అలాగే 15 ఏళ్లు నిండి పదవ తరగతి పాస్ అయిన వారు, ఇంటర్ మధ్యలో ఆపేసిన వారు, ఫెయిల్ అయిన వారు ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓపెన్ స్కూల్లో పొందిన సర్టిఫికెట్లు సాధారణ సర్టిఫికెట్లతో సమాన విలువను కలిగి ఉంటాయి. ఉపాధి ఉద్యోగ అవకాశాలకు వీటితో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
వెబ్సైట్ : https://apopenschool.ap.gov.in/index.aspx
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్