BKKI NEWS (DEC. 06) : AP INTERMEDIATE PUBLIC EXAMS 2025 SCHEDULE. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి 2025 మార్చి 1 నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే మార్చి ఒకటి నుండి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2025 నిర్వహించనున్నారు.
AP INTERMEDIATE PUBLIC EXAMS 2025 SCHEDULE
ఫిబ్రవరి 10వ తేదీ నుండి ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించడానికి ప్రతిపాదనలు పంపారు. ఫిబ్రవరి 1, 3వ తేదీలలో పర్యావరణ విద్య పరీక్ష మరియు నైతిక విలువలు పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్లో పొందుపరిచారు.
ప్రభుత్వం ఈ పరీక్షల షెడ్యూల్ కు ఆమోదం తెలిపితే వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనుంది.