BIKKI NEWS (SEP. 21) : ap intermediate colleges timings 9 to 5 now. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు ఎయిడెడ్ జూనియర్ కళాశాలను సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది.
ap intermediate colleges timings 9 to 5 now.
ప్రస్తుతం ఉన్న సమయం కంటే గంట అదనంగా విద్యార్థులతో అధ్యాపకులు గడపాలని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
సాయంత్రం 4.00 గంటల నుండి 5.00 గంటల వరకు స్టడీ అవర్లు (అదనపు తరగతులు) నిర్వహించాలని సూచించింది అలాగే ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు రెగ్యులర్ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది.