Home > EMPLOYEES NEWS > 2,146 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

2,146 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

BIKKI NEWS (MARCH 07) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన 2, 146 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరీస్తూ (ap govt regularize the contract employees in medical department ) ఉత్తర్వులు జారీ చేసింది.

2014.ఏప్రిల్ ఒకటి నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న 2,146 మందిని రెగ్యులరైజ్ చేస్తూ వైద్యశాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు జీవో జారీ చేశారు.

పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 2,025 మంది, DME పరిధిలో 62, కుటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాల్లో నలుగురిని క్రమబద్ధీకరణ చేశారు.

ఈ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఎప్రిల్ – 01 – 2024నుండి అమలులోకి రానుందని ఉత్తర్వులలో పేర్కొంది.

AP CONTRACT EMPLOYEES REGULARIZATION GO

ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది శాంక్షన్ పోస్టులలో, సంబంధించిన పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థులను చేసినట్లు తెలిపారు.