Home > JOBS > DSC (TRT) > AP DSC 2025 – ఆగస్టు లోగా టీచర్ నియామకాలు

AP DSC 2025 – ఆగస్టు లోగా టీచర్ నియామకాలు

BIKKI NEWS (JULY 05) : AP DSC 2025 RECRUITMENT UPTO AUGUST. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియను ఆగస్టులోగా పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు.

AP DSC 2025 RECRUITMENT UPTO AUGUST.

ఇప్పటికే పరీక్షలు పూర్తి కాగా కొన్ని సబ్జెక్టులు మినహా ప్రాథమిక కీ లు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియను వేగవంతం చేసి ఆగస్టు నాటికి పాఠశాలల్లో టీచర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి సమీక్ష సమావేశంలో తెలిపారు.

నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు నష్టం కలగకుండా వీలైనంత త్వరగా టీచర్ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు