Home > JOBS > DSC (TRT) > AP DSC 2025 Guidelines – కీలక మార్పులు ఇవే

AP DSC 2025 Guidelines – కీలక మార్పులు ఇవే

BIKKI NEWS (APR. 21) : AP DSC 2025 KEY CHANGES AND RULES. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన మెగా డీఎస్సీ 2025లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కీలక మార్పులను అభ్యర్థులు గమనించవలసి ఉంటుంది

AP DSC 2025 KEY CHANGES AND NEW RULES

1) అభ్యర్థులు దరఖాస్తు సమయంలో కచ్చితంగా అర్హత సర్టిఫికెట్లను అప్లోడ్ చేయవలసి ఉంటుంది

2) అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే ఏ పోస్టులకు దరఖాస్తు చేస్తున్నారు ప్రాధాన్యత క్రమంలో తెలుపవలసి ఉంటుంది

3) గత ప్రభుత్వ హయాంలో డీఎస్సీ 2024 దరఖాస్తు ఫీజు చెల్లించిన అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

4) దరఖాస్తు ఫీజు పోస్టుకు 750/- రూపాయలుగా నిర్ణయించారు

AP DSC SYLLABUS PDF

5) అభ్యర్థులు తప్పుడు సమాచారం నింపితే క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పించారు

6) అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది

7) ప్రత్యేక విద్య బీఈడి కలిగిన అభ్యర్థులు సాధారణ పోస్టులకు అర్హత సాధిస్తే వారికి ఆరు నెలల శిక్షణ ఇచ్చి పోస్టులు కేటాయిస్తారు

8) ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ప్రకారం నూతన రిజర్వేషన్ల
విధానాన్ని అమలు చేయనున్నారు.

9) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అకాడమిక్ మరియు ఆంగ్లభాషపై శిక్షణ ఇవ్వనున్నారు

10) పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించి నార్మలైజేషన్ ద్వారా ర్యాంకులు కేటాయించనున్నారు

11) ప్రశ్నాపత్రం రెండు భాషాలలో ఉండనుంది

AP DSC 2025 APPLICATION LINK

12) PD, PET పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి టెట్ అర్హత అవసరం లేదు. వీరికి ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష లేదు.

13) ప్రిన్సిపాల్, PGT, TGT, నాన్ లాంగ్వేజెస్ వారికి ఇంటర్మీడియట్ స్థాయిలో ఆంగ్ల భాష నైపుణ్యం పరీక్ష ఉంటుంది.

13) ప్రిన్సిపాల్, PGT లకు టెట్ ఉండదు.

14) గత నోటిఫికేషన్ లో తీసుకువచ్చిన రెండు సంవత్సరాల అప్రెంటిస్ విధానాన్ని ఈ నోటిఫికేషన్ లో రద్దు చేశారు.

15) స్పోర్ట్స్ కోటాలో మూడు శాతం ఉద్యోగాలను కేటాయించనున్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు