BIKKI NEWS (JUNE 06) : AP DSC 2025 EXAMS GUIDELINES. ఏపీ డీఎస్సీ పరీక్షలు నేటి నుంచి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. మొత్తం 44 సెషన్స్ లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
AP DSC 2025 EXAMS GUIDELINES
ఉదయం సెషన్ 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.00 నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహించనున్నారు.
పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యం ఆయిన పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
ఎలాంటి ఎలక్ట్రానిక్ సంబంధించిన పరికరాలు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
మొత్తం 16,437 పోస్టులకు 3,36,305 మంది 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారు.
కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే పరీక్షల కోసం రాష్ట్రంలో 137 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, కోదాడ, చెన్నై, బెంగళూరు, బెర్హంపూర్‌లో మరో 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కాగా, ఏపీ డీఎస్సీ పరీక్షలకు నాన్ లోకల్ కింద 20 శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీపడేందుకు తెలంగాణ చెందిన సుమారు 7 వేల మంది దరఖాస్తు చేశారు.
8 రోజులపాటు రెండు రాష్ట్రాల పరీక్షలు ఉండగా, 20వ తేదీన ఎక్కువ మందికి ఇటు టెట్ పేపర్-1, అటు ఏపీ డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులకు పరీక్ష ఉండటం సమస్యగా మారింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్