BIKKI NEWS (JUNE 27) : AP DSC 2024 DISTRICT WISE VACANCIES. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ కు మొదట సంతకం పెట్టడంతో పాటు, మొదటి క్యాబినెట్లోనే పోస్టుల భర్తీ కొరకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాల వారి టీచర్ పోస్టుల ఖాళీల వివరాలను ఇలా ఉండనున్నాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, టీజీటి, పీజీటీ మరియు ప్రిన్సిపాల్ పోస్టులు కలవు.
ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జూలై 1న విడుదల చేయనున్నారు. అలాగే డిసెంబర్ 10 వరకు ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పోస్టింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఈ 16,347 పోస్టులలో మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూల్ లలో 14,066 పోస్టులు కలవు మిగతా 2,281 పోస్టులు గురుకులాలు మోడల్ స్కూల్స్ లలో కలవు.
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 2024 లో అత్యధిక పోస్టులు కర్నూలు జిల్లాలో, అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో కలవు. పోస్టుల పరంగా చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అధికంగానూ, ప్రిన్సిపాల్ పోస్టులు అది తక్కువగాను కలవు.
ఇప్పటికే టెట్ 2024 ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
SGT – 6,371
పీఈటీ – 132
స్కూల్ అసిస్టెంట్స్ – 7725
టీజీటి – 1781
పీజీటీ – 286
ప్రిన్సిపల్స్ – 52
AP DSC 2024 DISTRICT WISE VACANCIES
శ్రీకాకుళం – 543
విజయనగరం – 583
విశాఖపట్నం – 1134
తూర్పు గోదావరి – 1346
పశ్చిమ గోదావరి – 1067
కృష్ణా – 1213
గుంటూరు – 1159
ప్రకాశం – 672
నెల్లూరు – 673
చిత్తూరు – 1478
కడప – 709
అనంతపురం – 811
కర్నూలు – 2678