BIKKI NEWS (AUG. 27) : AP 6100 CONSTABLE JOBS EVENTS SCHEDULE 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈవెంట్స్ షెడ్యూల్ ను రెండు మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
AP 6100 CONSTABLE JOBS EVENTS SCHEDULE 2024
గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా 6100 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలో దాదాపు 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
ప్రిలిమినరీ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు దేహ ధారుఢ్య, శారీరక సామర్ధ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. వీటికి సంబంధించి షెడ్యూల్ ను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.