BIKKI NEWS (OCT. 26) : AP 10th public exams fees schedule 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 – 25 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం షెడ్యూల్ జారీ చేసింది.
AP 10th public exams fees schedule 2024.
అక్టోబర్ 28 నుంచి నవంబరు 11లోపు ఫీజు చెల్లించాలని సూచించారు.
50/- రూపాయల ఆలస్య రుసుముతో నవంబరు 12వ తేదీ నుంచి నవంబరు 18 వరకు చెల్లిస్తే రూ.50,
రూ.200 ఆలస్య రుసుముతో నవంబర్ 19 నుంచి 25 వరకు రూ.200,
రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్ 26 నుంచి నవంబరు 30 వరకు చెల్లించడానికి అవకాశం కల్పించారు.
ఆన్లైన్లోనే పరీక్ష ఫీజు చెల్లించాలని, పాఠశాల లాగిన్ ద్వారా ప్రధానోపాధ్యాయులూ చెల్లించొచ్చని సూచించారు.
రెగ్యులర్ విద్యార్థులు రూ.125/-, సప్లిమెంటరీ రాసే వారు మూడు సబ్జెక్టుల వరకు రూ.110/- , అంత కంటే ఎక్కువ ఉంటే రూ.125/-,
వృత్తి విద్యా విద్యార్థులు అదనంగా రూ.60/- చెల్లించాలని తెలిపారు.
వయసు తక్కువగా ఉండి పరీక్షలకు హాజరయ్యే వారు రూ.300/- , మైగ్రేషన్ సర్టిఫికెట్ అవసరమయ్యేవారు రూ.80/- చెల్లించాలని సూచించారు.