BIKKI NEWS (JUNE 21) : Ambedkar overseas scholarships now 500. తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఇక నుంచి సంవత్సరానికి 500 మందికి అవకాశం కల్పించే ఫైలుపై తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు, గిరిజన అభివృద్ధి, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ తొలి సంతకం చేశారు.
అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు ఏటా 210 మంది ఎస్సీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నతవిద్యా అభ్యాసానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల సంఖ్యను 500 లకు పెంచారు.
అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 844 మంది దివ్యాంగులకు రూ.5 కోట్లతో స్వయం ఉపాధి కల్పించే యూనిట్ల మంజూరు, అదేవిధంగా దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి తద్వారా 2367 మందికి 3.50 కోట్లను పంపిణీ చేసే ఫైలుపై సంతకం చేశారు.
అదేవిధంగా మేడారం జాతరలో ఏర్పాట్లకు సంబంధించిన రూ.45 కోట్ల పనులకు, రూ.79.61 కోట్లతో గిరిజన విద్యాలయాల మరమ్మతు పనులకు, మినీ గురుకులాల నిర్వహణకు 17.18 కోట్లను, . అనుమతులు మంజూరు చేశారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్