BIKKI NEWS (JAN. 02) : AISSEE 2025 NOTIFICATION and Application Link. దేశంలోని 33 + 17 సైనిక స్కూళ్లలో 2025 – 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(AISSEE – 2025) నోటిఫికేషన్ విడుదల చేసింది.
AISSEE 2025 NOTIFICATION and Application Link
ఆంధ్రప్రదేశ్ లో కోరుకొండ (విజయనగరం జిల్లా), కలికిరి (చిత్తూరు.జిల్లా), కృష్ణపట్నం (నెల్లూరు)లో సైనిక పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్
ఏజెన్సీ నిర్వహిస్తుంది.
సీట్ల కేటాయింపు : ఆరో తరగతి (ప్రభుత్వ – 2970, ప్రైవేటు- 2255)కి మొత్తం 5225; తొమ్మిదో తరగతికి 697 సీట్లు కేటాయించారు.
అర్హతలు: ఆరో తరగతికి ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10-12 ఏళ్ల
మధ్యలో ఉండాలి. బాలికలు కూడా ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు .
తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 13-15 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం : అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్ లో డిసెంబర్ 24 – 2024 నుంచి జనవరి 13 – 2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఎడిట్ అవకాశం : 2025 జనవరి 16 నుంచి 18వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : ఎస్సీ/ ఎస్టీ చెందిన విద్యార్థులు రూ 800/- ఇతరులు రూ 650/-
పరీక్ష తేదీ : జనవరి 19, 2025న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
6వ తరగతి : మధ్యాహ్నం 2.00 – 4.30 వరకు
9వ తరగతి : మధ్యాహ్నం 2.00 – 5.00 వరకు
పరీక్ష విధానం :
6వ తరగతి : మల్టీపుల్ చాయిస్ టైప్ లో 125 ప్రశ్నలకు 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. (లాంగ్వేజ్ , మ్యాథమెటిక్స్, ఇంటిలిజెన్స్, జనరల్ నాలెడ్జ్ అంశాలపై పరీక్ష ఉంటుంది.)
9వ తరగతి : మల్టీపుల్ చాయిస్ టైప్ లో 150 ప్రశ్నలకు 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. ( మ్యాథమెటిక్స్, ఇంటిలిజెన్స్, ఇంగ్లీషు జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ అంశాలపై పరీక్ష ఉంటుంది.)
- INTER EXAMS – ఆరో రోజు రిపోర్ట్
- AP EAPCET 2025 నోటిఫికేషన్ విడుదల
- CURRENT AFFAIRS 11th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS 10th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
- INTER EXAMS QP SET – 12th March 2025