AQLI – 2023 REPORT : వాయు నాణ్యత సూచీ విశేషాలు

BIKKI NEWS : AIR QUALITY LIFE INDEX REPORT – 2021 నివేదికను యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ 2013 – 2021 మద్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన కాలుష్య స్థాయిలను తెలుపుతూ AQLI – 2021 పేరిట విడుదల చేసింది. వీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన కాలుష్య స్థాయిల ప్రకారం ఈ నివేదిక రూపొందించారు.

2013- 2021 మధ్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన కాలుష్యంలో భారత్ వాటా 59.1 శాతమని తెలిపింది.

◆ MOST POLLUTED COUNTRIES LIST

ఈ నివేదిక ప్రకారం అత్యంత కాలుష్య దేశాల జాబితాలో మొదటి స్థానంలో బంగ్లాదేశ్, రెండో స్థానంలో ఇండియా నిలిచాయి.

1) బంగ్లాదేశ్
2) ఇండియా
3) నేపాల్
4) పాకిస్థాన్
5) మంగోలియా

◆ MOST POLLUTED STATES IN INDIA

ఈ నివేదిక ప్రకారం అత్యంత కాలుష్య రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, రెండో స్థానంలో బీహార్ ఉన్నాయి.

1) ఉత్తరప్రదేశ్
2) బీహార్
3) పశ్చిమ బెంగాల్
4) రాజస్తాన్
5) మధ్యప్రదేశ్
6) మహారాష్ట్ర
7) గుజరాత్
8) ఆంధ్రప్రదేశ్
9) కర్ణాటక
10) తమిళనాడు

◆ తగ్గుతున్న ఆయుర్దాయం

వాయు కాలుష్యం కారణంగా భారతీయుల సగటు ఆయుర్దాయం కన్నా 5.3 ఏళ్లు తగ్గుతుందని తెలిపింది. అత్యధికంగా ఢిల్లీ వాసులకు 11.9 ఏళ్లు, ఏపీలో 2.6 ఏళ్లు, తెలంగాణలో 3.2 ఏళ్లు సగటున జీవితకాలం తగ్గుతున్నట్లు నివేదిక పేర్కొంది.

జాతీయ వాయు నాణ్యత ప్రమాణం ప్రకారం చూసినా దేశ రాజధాని వాసులు సగటు కన్నా 8.5 ఏళ్లు నష్ట పోతున్నారని తెలిపింది. జాతీయ వాయు నాణ్య ప్రమాణం 40 మైక్రో గ్రాములు/క్యూబిక్ మీటర్ల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆయుష్షు ముప్పు లేదని తెలిపింది

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం పర్టిక్యులేట్ మీటర్ (పీఎం) 2.5 మైక్రో గ్రాములు / క్యూబిక్ మీటర్ కాలుష్యం ఉండాల్సి ఉంది.

దేశంలోని మొత్తం 130 కోట్ల మందికి పైగా ప్రజలు వార్షిక సగటు కాలుష్య స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు.

జాతీయ వాయు నాణ్యత ప్రమాణం 40 మైక్రో గ్రాములు/క్యూబిక్ మీటర్లకు మించి కాలుష్యం ఉండే ప్రాంతాల్లో 67.4 శాతం మంది నివసిస్తన్నారని నివేదిక తెలిపింది.

దేశంలో హృదయ సంబంధ వ్యాధులతో 4 ఏళ్లు, తల్లీ పిల్లల పోషకాహార లోపంతో 1.8 ఏళ్ల ఆయుర్దాయం కోల్పోతున్నట్లు నివేదిక పేర్కొంది.

సగటు కంటే ఎక్కువగా ఆయుర్దాయం కోల్పోతున్న అతధిక జనాభా కలిగిన 10 రాష్ట్రాలు వరసగా… యూపీ, బిహార్, బెంగాల్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయని తెలిపింది.