BIKKI NEWS (OCT. 07) : agricultural degree courses admissions 2024. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అందిస్తున్న వివిధ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది.
agricultural degree courses admissions 2024
కోర్సుల వివరాలు
బీఎస్సీ (హాన్స్) అగ్రికల్చర్,
బీఎస్సీ (హాన్స్) కమ్యూనిటీ సైన్స్,
బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ),
బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్),
బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ (బీఎఫ్ఎస్సీ),
బీఎస్సీ (హాన్స్) హార్టీకల్చర్
పై కోర్సులలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం మొదటి దశ కౌన్సెలింగ్ అక్టోబర్ 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
తెలంగాణ ఎంసెట్ – 2024 పరీక్షలో అర్హత పొంది, – ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి ర్యాంకు ఆధారంగా నిర్ణీత షెడ్యూల్ రోజు కౌన్సెలింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది.
కౌన్సెలింగు అభ్యర్థులు షెడ్యూల్లో పేర్కొన్న అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, నిర్ణీత రుసుముతో రావాలని కోరారు. కౌన్సెలింగ్ రోజే ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తారు.
కౌన్సెలింగ్ లో ఎంసెట్ పరీక్షలో అభ్యర్థుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్, ఇతర వివరాల కోసం అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్సైట్ ను సందర్శించాలని కోరారు.