JOURNALISM ADMISSIONS : జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు

హైదరాబాద్ (ఆగస్టు – 14) : ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన వివిధ జర్నలిజం కోర్సుల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాల (admiisions in journalism courses in ap college of journalism hyderabad) కోసం ప్రకటన విడుదల చేసింది.

వివరాలు

పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (PGDJ): కోర్సు వ్యవధి 12 నెలలు. కనీస విద్యార్హత డిగ్రీ.

డిప్లొమా ఇన్ జర్నలిజం (DJ): కోర్సు వ్యవధి 6నెలలు. కనీస విద్యార్హత డిగ్రీ.

డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం (DTVJ): కోర్సు వ్యవధి 6 నెలలు. కనీస విద్యార్హత డిగ్రీ.

సర్టిఫికెట్ కోర్సు ఆఫ్ జర్నలిజం (CJ): కోర్సు వ్యవధి 3 నెలలు. కనీస విద్యార్హత ఎస్ఎస్సీ.

ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ కోర్సుల్ని రెగ్యులర్ గాను, దూరవిద్య విధానంలోనూ చేయవచ్చు. ఆన్లైన్ తరగతుల సౌకర్యం ఉంది. ఇంటి దగ్గర నుంచే పాఠ్యాంశాలను లైవ్ వినవచ్చు. తెలుగు లేదా ఇంగ్లిష్ బోధనా మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు.

ప్రాస్పెక్టస్, దరఖాస్తు ఫారం పొందటానికి చివరి తేది : 21.08.2023

అడ్మిషన్లు పొందటానికి చివరి తేది: 02.09.2023

వెబ్సైట్: www.apcj.in