BIKKI NEWS (SEP. 10) : Adjust the Redeployed lecturers in GJCs. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనంగా ఉన్న రీడిపార్ట్మెంట్ జూనియర్ లెక్చరర్సును ఖాళీగా ఉన్న ఇతర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్దుబాటు చేయవలసిందిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి శ్రీ బుర్ర వెంకటేశం గారికి ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపించినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ – 475 రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వి. శ్రీనివాస్, డాక్టర్ కోప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.
Adjust the Redeployed lecturers in GJCs
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగస్తుల సాధారణ బదిలీలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆగస్టు నెలలో బదిలీలు నిర్వహించడం జరిగిందని. ఈ బదిలీలలో కొంతమంది రెగ్యులర్ జూనియర్ లెక్చరర్స్, రీడీప్లైయిడ్ జూనియర్ లెక్చరర్స్ పనిచేస్తున్న కాలేజీలో కూడా అదే సబ్జెక్టులో బదిలీ కావడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం కొన్ని జూనియర్ కళాశాలలో ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చిన రెగ్యులర్ లెక్చరర్స్ మరియు గతంలో అదే కళాశాలలో పనిచేస్తున్న రీడప్లయిడ్ లెక్చరర్స్ కూడా అదే సబ్జెక్టులో ప్రస్తుతం ఇద్దరు జూనియర్ లెక్చరర్స్ కొనసాగుతున్నారని తెలిపారు .
ఈ విషయాన్ని పరిశీలించి రీడీప్లయిడ్ జూనియర్ లెక్చరర్స్ ను ఇతరు జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులలో సర్దుబాటు చేసి, విద్యార్థులకు విద్యాబోధనల ఆటంకం జరగకుండా చూడవలసిందిగా వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. ఈ విషయాన్ని గౌరవ ఇంటర్ విద్య డైరెక్టర్ గారికి కూడా ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపించినట్లు తెలిపారు.