BIKKI NEWS (FEB. 16) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా (aadhar compulsory for free electricity scheme) ఉండాలని పేర్కొంది. 6 గ్యారేంటీలలో ముఖ్యమైన గృహజ్యోతి పథకం మార్గదర్శకాలు త్వరలోనే విడుదల కానున్నాయి.
ఆధార్ కార్డు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని తదనంతరం ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఉచిత విద్యుత్ పథకం పొందాలనుకునేవారు తప్పనిసరిగా ఆధార్ అథంటికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.