లాస్‌ఎంజెల్స్ (మార్చి -13) : 95వ ఆస్కార్ అవార్డుల (95th Oscar) ప్రదానోత్సవం డాల్పీ దియోటర్ లో ఘనంగా జరిగింది. 23 విభాగాలలో ఈ అకాడమీ అవార్డులను అందజేస్తారు. “ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్” 7 విభాగాలలో, ” ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్” చిత్రానికి 4 విభాగాలలో అవార్డులు గెలుచుకున్నాయి.
◆ భారత్ కు రెండు ఆస్కార్ లు :
భారత్ కు రెండు అస్కార్ అవార్డులు దక్కించుకుంది. “ది ఎలిఫెంట్ విస్పరర్స్” ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో, RRR సినిమాలోని “నాటు నాటు” పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డులు దక్కించుకున్నాయి.
- ఉత్తమ చిత్రంగా “ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్” చిత్రం నిలిచింది.
- ఉత్తమ నటుడుగా బ్రెండన్ ఫ్రెజర్,
- ఉత్తమ నటి గా మిచిల్లే యోవ్,
- ఉత్తమ దర్శకుడు గా డేనియల్ క్వాన్, డేనియల్ చెనెర్ట్ నిలిచారు.
◆ 7 అస్కార్ లు కైవసం :
“ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్” 7 విభాగాలలో అవార్డులు సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.
◆ 4 ఆస్కార్ లు :
” ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్” చిత్రానికి నాలుగు విభాగాలలో అస్కార్ అవార్డులు గెలుచుకుంది.