BIKKI NEWS (DEC. 05) : 90 days action plan in intermediate education. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కళాశాలల వారీగా 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కమీషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు.
90 days action plan in intermediate education
ఇంటర్ వార్షిక పరీక్షలకు మరో మూడు నెలల సమయమే ఉండటంతో 90 రోజుల ప్రణాళికను చేపట్టారు.
ఇందులో భాగంగా జూనియర్ లెక్చరర్, ప్రిన్సిపాల్, డీఐఈవో, కమీషనర్ వరకు ప్రతిరోజూ ఎవరు ఏమి చేయాలి అంటూ ప్రత్యేక ప్రణాళికను 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా అమలు చేయనున్నారు.
ప్రస్తుతం అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండేళ్లు కలిపి 1.80 లక్షల మంది చదువుతున్నారు. అయితే, పలుచోట్ల సగం మంది విద్యార్థులు కూడా తరగతులకు హాజరవడం లేదు. ఉత్తీర్ణత 50 శాతానికి మించడం లేదు. 2023లో ఫస్టియర్‌లో 40% మందే పాసయ్యారు.
ఈ క్రమంలో గత మూడేళ్ల గణాంకాలను పరిశీలించిన కృష్ణ ఆదిత్య… గైర్హాజరవుతున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కళాశాలకు పిలిపించి మాట్లాడాలని… రెండు, మూడుసార్లు పిలిచినా రాకుంటే వారి పేర్లను తొలగించాలని ఆదేశించారు.
చదువులో ప్రతి విద్యార్థి స్థాయిని అంచనా వేయాలని, వెనకబడిన వారిని గుర్తించి… ఎన్ని ప్రత్యేక తరగతులు తీసుకుంటే మిగిలిన విద్యార్థులతో సమానంగా తయారవుతారో అంచనా వేయాలని సూచించారు. ఆ ప్రకారం అధ్యాపకులు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని ఆదేశించారు.
అన్ని సబ్జెక్టుల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి 90 రోజులు అమలు చేయాలని, అందుకు కళాశాల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకొని నివేదిక పంపాలని సూచించారు.
ప్రతి కళాశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి. విద్యార్థుల స్థాయిని వారికి వివరించి, రానున్న 90 రోజులపాటు పిల్లలకు సహకరించాలని కోరాలి.
డిసెంబరు నెలాఖరుకు సిలబస్ పూర్తి చేయాలి. డీఐఈఓలు ప్రతి కళాశాలను తనిఖీ చేస్తూ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు సూచనలివ్వాలి.
ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఒక మహిళా, ఒక పురుష అధ్యాపకులను కౌన్సెలర్లుగా నియమించాలి. ఎవరైనా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతుంటే కౌన్సెలింగ్ నిర్వహించాలి. టెలీమానస్ టోల్‌ఫ్రీ నంబరులో అందుబాటులో ఉండే సైకాలజిస్టుల సేవలు పొందాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు జరగకుండా చూడాలి.
ఒక్కో కళాశాలలో కనీసం నాలుగు సీసీ కెమెరాలు అమర్చాలి. ఇప్పటికే అద్దె ప్రాతిపదికన ఉంటే వాటి స్థానంలో… శాశ్వతంగా కొనాలి. అవసరమైతే నాలుగు కంటే ఎక్కువ ఏర్పాటు చేసుకోవచ్చు.
ప్రతి ప్రభుత్వ కళాశాలకు ప్రయోగశాలల అవసరాల కోసం వారం రోజుల్లో రూ.25 వేల చొప్పున మంజూరు చేయాలి.
- CURRENT AFFAIRS 10th DECEMBER 2024
- NEET PG 2025 – నీట్ పీజీ పరీక్ష తేదీ వెల్లడి
- CUET UG CHANGES – సీయూఈటీ లో కీలక మార్పులు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 12 – 2024
- GK BITS IN TELUGU 12th DECEMBER