హైదరాబాద్ (సెప్టెంబర్ – 02) : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా ఉన్న తన బ్రాంచ్ లలో 6,160 అప్రెంటిస్ ఖాళీలను (6160 apprenticeship vacancies enganging by sbi) భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 390, తెలంగాణలో 125 ఖాళీలు కలవు.
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 21వ తేదీ లోపు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత పరీక్ష అక్టోబర్/నవంబర్ – 2023 లో ఉండవచ్చు.
అభ్యర్థులు వయోపరిమితి ఆగస్టు 01 – 2023 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సరలింపు కలదు.
ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒక సంవత్సరం కాలం పాటు కొనసాగే ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ కాలంలో నెలకు 15,000/- రూపాయల చొప్పున అభ్యర్థికి చెల్లిస్తారు.
ఎంపిక చేయడానికి ఆన్లైన్ రాత పరీక్ష మరియు స్థానిక భాష పరీక్ష నిర్వహించబడుతుంది.
ఆన్లైన్ రాత పరీక్షలో జనరల్ ఫైనాన్స్ ఎవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీస్ – కంప్యూటర్ ఎబిలిటీస్, జనరల్ ఇంగ్లీష్ లలో 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలలో రాత పరీక్ష ఉంటుంది.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి 300/- రూపాయలు దరఖాస్తు ఫీజు ఉంటుంది ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగులకు ఫీజు లేదు.
వెబ్సైట్ : https://sbi.co.in/web/careers
వెబ్సైట్ : https://sbi.co.in/web/careers#lattest