BIKKI NEWS (OCT. 02) : 600 JOBS IN INSURANCE MEDICAL SERVICES. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టరేట్ పరిధిలో ఖాళీగా ఉన్న 600 పోస్టులు భర్తీ కొరకు తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.
600 JOBS IN INSURANCE MEDICAL SERVICES
ఈ మేరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్టులను నింపేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు (TG MHSRB) అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పది రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. త్వరలోనే ఈ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పోస్టుల వివరాలు
స్టాఫ్ నర్స్ – 272
సివిల్ అసిస్టెంట్ సర్జన్ – 124
ఫార్మసిస్ట్ గ్రేడ్-2 : 99
ANM – 54
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్- 2 : 34
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ – 7
రేడియోగ్రాఫర్ – 5
డెంటల్ టెక్నీషియన్ – 3
డెంటల్ హైజెనిస్ట్ – 1
ఆడోమెట్రిక్ టెక్నీషియన్ -1