హైదరాబాద్ (డిసెంబర్ – 25) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలకు దరఖాస్తు చెసుకోవాల్సిన అభ్యర్థులు (6 Guarentees application process) డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ, వార్డు సభలలో ఏర్పాటు చేసిన కౌంటర్ లలో దరఖాస్తులు సమర్పించి, రశీదు పొందవలసి ఉంటుంది.
ప్రభుత్వం 5 గ్యారెంటీలకు అనగా చేయూత, రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు పథకాల అమలు కోసం దరఖాస్తులను డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు (డిసెంబర్ 31, జనవరి 1 సెలవు) స్వీకరించనున్నది
ప్రజాపాలన పేరుతో ఈ గ్రామ, వార్డు సభలను నిర్వహిస్తారు. 26వ తేదీ నుండి అధికారులే ఇంటికి వచ్చి దరఖాస్తులు అందిస్తారు.
ప్రజలు కచ్చితంగా ఆధార్ కార్డ్, తెల్లరేషన్ కార్డు జిరాక్స్ లను దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది.
తెల్లరేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తెల్లరేషన్ కార్డు వచ్చిన తర్వాత వారికి పథకాలు అమలవుతాయి.
దరఖాస్తు దారుడు కుటుంబ సభ్యుల వివరాలను కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది.