BIKKI NEWS (DEC.26) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కార్యక్రమం కింద ఆరు గ్యారెంటీ ల అమలులో భాగంగా ఐదు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు ఫారం (6 Guarantee application form download link) ను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు 2,500/- మరియు గ్యాస్ సిలిండర్ 500/- కే అందించే కార్యక్రమం.
ఇందిరమ్మ ఇండ్లు కింద తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 గజాల ఇళ్ల స్థలము కొరకు.
గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం.
చేయూత పథకం కింద వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, బీడీ టేకేదారులకు, ఒంటరి మహిళలకు, డయాలసిస్, ఎయిడ్స్, పైలేరియా వ్యాధిగ్రస్తులకు నెలకు 4,000/- రూపాయలు అందించే పథకం