BIKKI NEWS (NOV. 07) : 500 JOBS IN AP ENDOWMENT DEPARTMENT. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ క్యాడెర్లలోని అధికారులు, అర్చకులకు సంబంధించి 500 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
500 JOBS IN AP ENDOWMENT DEPARTMENT
గొల్లపూడిలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం రాష్ట్రంలోని దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాదాయ శాఖలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న అర్చక విభాగం, పరిపాలనా పరమైన విభాగంలో సిబ్బందిని నియమించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.