BIKKI NEWS (AUG. 14) : 3rd Phase Farmer Loan Waiver in Telangana . తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట రుణాల మాఫీకి సంబంధించి మూడో విడతను ఆగస్టు 15 వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది.
3rd Phase Farmer Loan Waiver in Telangana
ఖమ్మం పర్యటనలో భాగంగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం… వైరాలో జరిగే బహిరంగ సభలో మూడో విడత రైతు రుణమాఫీని విడుదల చేసే అవకాశం ఉంది. మూడో విడత రైతు రుణమాఫీ కింద రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కానుంది. ఇందులో దాదాపు 14 లక్షల మంది రైతులకు మేలు జరగనుంది.
జూలై 18న మొదటి విడత రైతు రుణమాఫీలో భాగంగా లక్ష రూపాయల లోపు రుణాలు కలిగిన రైతులకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే జూలై 30న 1,50,000 వరకు రుణాలు కలిగిన రైతులకు రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న 1,50,000 నుండి రెండు లక్షల రూపాయల రుణాలు కలిగిన రైతులకు రుణమాఫీ జరగనుంది.