APS RTC JOBS – 3500 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు

BIKKI NEWS (AUG. 21) : 3500 JOBS IN APSTRC 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ లో దాదాపు 3,500 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే దాదాపు 2,000 నూతన బస్సులు అవసరమవుతాయని అలాగే 3,500 మంది సిబ్బంది అవసరం అవుతారని వీటిని వెంటనే భర్తీ చేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నట్లు సమాచారం.

3500 JOBS IN APSTRC 2024

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై నేడు సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలోనే నూతన పోస్టుల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అనంతరం వీటి భర్తీ చేపట్టనున్నారు.

ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు కారణంగా నెలకు ఆర్టీసీకి 200 నుండి 250 కోట్లు అదనంగా ప్రభుత్వం నుంచి అందజేయాల్సి ఉంటుందని అధికారులు ప్రతిపాదనలలో తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుండి అమలు చేస్తారో నేటి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు