BIKKI NEWS (SEP. 26) : 317 GO issue will solve with in days. జీవో-317 ప్రభావిత ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ అంశంపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలోని క్యాబినెట్ సబ్ కమిటీ కసరత్తు పూర్తి చేసింది. నివేదికను రూపొందించి, మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరికి పంపినట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి.
317 GO issue will solve with in days
మంగళవారం సబ్ కమిటీ సీఎంతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారని పేర్కొన్నాయి. నివేదికను సీఎం ఆమోదిస్తే రెండుమూడు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నదని పేర్కొన్నాయి.
జీవో 317, జీవో 46పై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఫిబ్రవరిలో మంత్రి దామోదర అధ్యక్షతన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో సబ్ కమిటీని నియమించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించారు.
స్థానికత, భార్యాభర్తలు (స్పౌజ్), మెడికల్, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన కమిటీ.. సానుకూలంగా నిర్ణయం తీసుకున్నది. స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ బదిలీలకు పచ్చ జెండా ఊపిందని తెలిసింది. వారి బదిలీలకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి.
ఇక స్థానికతపై ఏం చేయాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీనిపై మరింత అధ్యయనం అవసరమని కమిటీ భావిస్తున్నట్టు తెలిసింది.