Home > TELANGANA > BC CASTS – బీసీ జాబితాలోకి 26 కులాలు.!

BC CASTS – బీసీ జాబితాలోకి 26 కులాలు.!

BIKKI NEWS (JULY 08) : 26 CASTS WILL INCLUDE IN BC CATEGORY. తెలంగాణ రాష్ట్రంలో బీసీ జాబితాలోకి 26 కులాలను తిరిగి చేర్చేందుకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బీసీ కమిషన్ సైతం బహిరంగ విచారణను పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం.

26 CASTS WILL INCLUDE IN BC CATEGORY

త్వరలోనే బీసీ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం, రాష్ట్ర బీసీ కమిషన్ చర్యలను బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి మొత్తంగా ఉమ్మడి ఏపీ బీసీ జాబితాలో 156 కులాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జారీ
చేసిన జీవోలు, జాబితాలను యథావిధిగా కొనసాగించుకోవచ్చు, లేదంటే 2 ఏండ్లలోపు మార్పులు చేర్పులు చేసుకోవచ్చని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సూచించింది.

అదే క్రమంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రూపొందించిన బీసీ కులాల జాబితాలో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది.

అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో లేని, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన దాదాపు 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించింది. 130 కులాలతో తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితాను రూపొందించింది.

ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు 26 కులాల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. తర్వాత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బీసీ కులాల తొలగింపు అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ బీసీ కమిషన్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు