BIKKI NEWS (SEP. 23) : 250 naval jobs in indian naval academy. ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఎ) లో 2025, జూన్ నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవీ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
250 naval jobs in indian naval academy
కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు ( 250) :
- జనరల్ సర్వీస్ (జీఎస్-ఎక్స్/ హైడ్రో క్యాడర్) – 56
- పైలట్ – 24
- నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్
- (ఎయిర్ క్రూ) – 21
- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ – 20
- లాజిస్టిక్స్ – 20
- నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ కేడర్ – 16
- ఎడ్యుకేషన్ – 15
- ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) – 36
- ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) – 42
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీకాం, బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమాతో పాటు నిర్దిష్ట శారీరక వైద్య ప్రమాణాలు ఉండాలి.
ప్రారంభ వేతనం : నెలకు రూ.56,100/- , ఇతర అలవెన్సులు.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ : 29-09-2024.
వెబ్సైట్ : https://www.joinindiannavy.gov.in/