ఇంటర్‌బోర్డు గుర్తింపులేని జూనియర్ కళాశాలలు 235.!

BIKKI NEWS (OCT. 28) : 235 junior colleges running without affiliation. తెలంగాణ రాష్ట్రంలో 235 ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు ఇంటర్‌బోర్డు గుర్తింపు లేకుండా ఈ విద్యా సంవత్సరంలో నడుస్తున్నట్లు సమాచారం. ఈ కళాశాలలు విద్యార్థుల నుంచి అడ్మిషన్లు సైతం తీసుకోవడం విశేషం మొత్తం కాలేజీల్లో 25శాతం కాలేజీలు ఇప్పటి వరకు గుర్తింపును దక్కించుకోలేకపోయాయని సమాచారం.

235 junior colleges running without affiliation

సగం విద్యాసంవత్సరం ముగిసినా వాటిపై చర్యలు తీసుకోవడమామో లేక అనుమతి ఇవ్వడమో ఇంటర్‌బోర్డు చేయాల్సి ఉంది.

ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్ల గడువు 20తో ముగిసింది. నేడో, రేపో ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ సైతం విడుదలకానుంది. గుర్తింపు ఉన్న కాలేజీల్లోని విద్యార్థుల నుంచే పరీక్ష ఫీజులు తీసుకుంటారు. దీంతో ఈ కాలేజీల్లో చదువుతున్న 50వేలకుపైగా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.

హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే గుర్తింపు లేని కాలేజీలు అత్యధికంగా ఉన్నట్లు సమాచారం.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు