DSC NOTIFICATION : 1,523 టీచర్ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అమోదం

హైదరాబాద్ (ఆగస్టు – 27) : ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల పాఠశాలలో శాశ్వత పద్ధతిలో టీచర్లను భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1523 పోస్టులను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ ద్వారా ఆమోదం తెలిపింది దీనితో ఈ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది.

పదిమంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున ఈ పోస్టులను మంజూరు చేయడం జరిగింది ప్రాథమిక పాఠశాలలో 796 ప్రాథమికోన్నత పాఠశాలలో 727 పోస్టులను మంజూరు చేయడం జరిగింది జిల్లాల వారీగా ఖాళీల వివరాలను కింద ఇవ్వడం జరిగింది.

ఈ పోస్టులకు బిఈడి (స్పెషల్) చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. నార్మల్ బిఈడి, టిటిసి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హత ఉండదు.

మొత్తం 6612 టీచర్ ఉద్యోగాలకు డీఎస్సీ నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల కానుంది. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించి ఫలితాలు విలువైన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

◆ జిల్లాల వారీగా ఖాళీల వివరాలు