BIKKI NEWS (DEC. 27) : తెలంగాణ రాష్ట్రంలో 14 వేల వరకు ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను
త్వరలోనే భర్తీ చేస్తామని (14000 anganwadi jobs in telangana) మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, తొర్రూరు మండలాల్లో మంగళవారం మంత్రి పర్యటించారు.
అంగన్వాడీలు, అప్‌గ్రేడ్ అయినా అంగన్వాడీలలో కలిపి దాదాపు 14 వేల ఉద్యోగ ఖాళీలు కలవని తెలిపారు. వీటికి సంబంధించిన జిల్లా వారీగా నోటిఫికేషన్ లు త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలభవనాలకు మరమ్మతులుంటే నిధులు మంజూరు చేస్తామన్నారు. అంగన్వాడీ కార్యకర్తల
వేతనాల పెంపునకు కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క వెల్లడించారు.