భూమిలేని రైతు కూలీలకు ఏటా 12 వేలు – భట్టి

BIKKI NEWS (SEP. 18) : 12000 rupees for landless agricultural workers. కాంగ్రెస్ ప్రభుత్వం భూమిలేని రైతు కూలీలకు ఏట 12 వేల రూపాయాల చొప్పున నగదు అందజేసే కార్యక్రమాన్ని ఈ ఏడాది నుండి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

12000 rupees for landless agricultural workers

భూమి ఉన్న రైతులకు రైతు భరోసా కింద ఏటా 15,000 రూపాయలను అందజేస్తున్న నేపథ్యంలో, భూమి లేని రైతు కూలీల కూడా ఆర్థిక సహాయం చేయాలని ఆలోచనతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు భట్టి తెలిపారు.

త్వరలోనే ఈ పథకానికి సంబంధించి నిబంధనలు రూపొందించి, అర్హులను ఎంపిక చేసి వారి ఖాతాలలో నేరుగా ఏటా 12 వేల రూపాయల చొప్పున నగదు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు